KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి సబ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న రవణయ్య ఉత్తమ లైన్ మెన్‌గా ఎంపికయ్యాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపిక అయిన రవణయ్యకి మైదుకూరు ఈఈ ప్రశంస పత్రం అందచేశారు. డివిజన్లోని ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్‌లో ఇంకా బాగా పనిచేయాలని కోరారు.