TG: పద్మశ్రీ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వివక్షకు గురవుతున్న వర్గానికి గుర్తింపు దక్కిందన్నారు. ఎంఆర్పీఎస్ చిన్న ఉద్యమంగా ప్రారంభమైందని తెలిపారు. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద సామాజిక ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో మోదీ ఎంతో సహకారం అందించారని చెప్పారు.