SRD: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ మీర్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు డైరెక్టర్‌ను ఆశీర్వదించి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు.