W.G: సీసలి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సుమారు 800 మంది దంపతులతో భక్తులచే ఉచిత సామూహిక సాయి సత్య వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.