ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన మైల నాగిరెడ్డికి ఆచార్య నాగార్జున గుంటూరు యూనివర్సిటీలో ‘నాణ్యమైన ఆరోగ్యకరమైన పాలు మరియు పాలవృత్తుల వినియోగంపై’ డాక్టరేట్ అందుకున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి ఉన్నత స్థాయికి ఎదగడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా పట్టణానికి చెందిన పలువురు మైల నాగిరెడ్డిని అభినందించి, సన్మానించారు.