E.G: సీతానగరం ఎంపీడీవో మండల పరిధిలో సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పీ.జీ.ఆర్.ఎస్ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా జిల్లా కలక్టరేట్ నుంచే హజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు.