కేంద్రం ప్రవేశ పెట్టిన PM కిసాన్ యోజన పథకం నగదు ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలుస్తోంది. అయితే జనవరి 31లోగా KYC చేయించుకున్నవారికి మాత్రమే ఈ పథకం ద్వారా వచ్చే రూ.2వేలు వారి అకౌంట్లలో పడతాయి. pmkisan.gov.in లోకి వెళ్ళి కుడివైపు ఉన్న e-KYCపై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే.. రిజిస్టర్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే KYC పూర్తి అవుతుంది.