TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాల్టీలకు అధికారులను నియమించింది. నేటితో 9 కార్పొరేషన్లు, 118 మున్సిపాల్టీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసింది. ఎల్లుండితో కరీంనగర్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం ముగియనుంది.