KKD: పులిమేరు పంచాయతీ కార్యదర్శి బళ్ళ బుల్లి వెంకటరమణకు ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడలో జరిగిన అవార్డుల ప్రాదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ చేతుల మీదుగా బళ్ల బుల్లి వెంకటరమణ అవార్డు అందుకున్నారు. తన సేవలకు గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విధుల పట్ల అంకీతభావంతో పని చేస్తానన్నారు.