NGKL: చారకొండ మండలంలోని జేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నెమలి గుట్ట తండాలో బడి బాట కార్యక్రమం సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ తల్లితండ్రులతో మమేకమై మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యతను వివరించారు. అలాగే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి విద్య ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు జంగూ నాయక్, గ్రామస్థులు పాల్గొన్నారు.