MLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా MLG జిల్లా కేంద్రంలోని ST బాలుర హాస్టల్‌ను శుక్రవారం రాత్రి MRO విజయ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా MRO ఆహారం నాణ్యత, తాగునీరు, సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని MRO సూచించారు.