MLG: మంగపేట మండలం రాజుపేట కప్ప వాగు మలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కారు అతివేగంగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.