ADB: సామాజిక సేవలో పలువురు దాతలు ముందుకు రావటం అభినందనీయమని ఆర్లి(టీ) గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని ఆర్లి(టీ) గ్రామస్తులకు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరిగినందున తమవంతుగా గ్రామస్తులకు దుప్పట్లను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.