ADB: భూముల కొలతల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని TTDC లో మంగళవారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జులై 26 వరకు కొనసాగనున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణకు హాజరైన 155 మంది లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు.