KNR: హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన విద్యుత్తు ఉద్యోగి ఏనురి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల విద్యుత్ ఉద్యోగులు సంతాపం తెలిపారు.