NZB: నవరాత్రుల పాటు పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం, సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందూరు నగరంలో ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా మొరం పనులు, విద్యుత్ స్తంభాలకు లైట్లను బిగించారు. 9వ రోజు కొన్ని వినాయకులు నిమజ్జనం చేయడంతో వినాయకుల బావి వద్ద బందోబస్తుతో పాల్గొంటున్నట్లు CP సాయి చైతన్య తెలిపారు.