MNCL: పోషణ పక్వాడలో భాగంగా మంచిర్యాల పద్మశాలి కాలనీ 1 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం వంటల పోటీలు నిర్వహించారు. కార్పొరేటర్ పెంట రజిత, కోఆప్షన్ సభ్యురాలు కొండ పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తల్లులు పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన వంటలు తయారు చేశారు. అనంతరం బహుమతులు అందజేశారు. సూపర్ వైజర్ గట్టు సరిత, టీచర్ సమ్మక్క, సహాయకురాలు భీమరాజు పాల్గొన్నారు.