SRPT: కోదాడ నుంచి గణపవరం గ్రామానికి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు, అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.