MLG: చదువే జీవితాన్ని, ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, బాలికలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి యూనిఫారమ్, పోషకాహారం, విద్యా సామగ్రి అందిస్తోందని తెలిపారు.