Bhagyalakshmi temple : కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.
తాను మునుగోడు (Munugodu) ఎన్నిక కోసం BRS నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Bhagyalakshmi Goddess Temple) వద్ద ప్రమాణం చేసేందుకు టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దమయ్యారు. కాసేపట్లో ఆలయం వద్దకు రేవంత్ చేరుకోనున్నారు. రేవంత్ మునుగోడు ఎన్నిక కోసం BRS నుంచి పైసాలు తీసుకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన రేవంత్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని ఈటల రావాలని సవాల్ విసిరారు.బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీ(Congress party)కి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో మండిపడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ (BRS) పార్టీ నుండి తాము డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.