ఇళ్ల పంపిణీకి సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పోడు భూముల పట్టాల పంపిణీకి తెలంగాణ(Telangana) సర్కార్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. జూన్ 24వ తేది నుంచి జూన్ 30వ తేది వరకూ గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ(Podu Pattas Distribution) చేయనుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. పోడు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు కూడా వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టాలన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను త్వరగా సిద్ధం చేయాలన్నారు.
పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్(CM KCR) అధికారులతో సమావేశం నిర్వహించారు. పోడు భూముల పంపిణీకి తానే స్వయంగా హాజరుకానున్నట్లు తెలిపారు. కొత్తగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థికశాఖకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇళ్ల పంపిణీకి సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జులైలో దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలిచ్చారు.