NRML: ట్రిపుల్ ఐటీ బాసర ఈసీఈ అధ్యాపకుడు ఎ. సాయినాథ్ చైతన్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీ.హెచ్.డి ప్రదానం చేసింది. విశ్వేశ్వరయ్య స్కీమ్‌లో ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించిన ఆయన, కంప్యూటర్ విజన్‌పై పరిశోధన పూర్తి చేశారు. అధికారులు, బాసర అధ్యాపకులు ఈ సందర్భంగా సోమవారం వారిని అభినందించి సన్మానించారు.