NRPT: ఉట్కూరు మండలం మొగ్దుంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి జే. దీప్తి, విజయలక్ష్మి అనే ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారని హెచ్ఎం శివరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఘనమైన విజయంతో ఎంపిక కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, ఉపాద్యాయులు విద్యార్థులను అభినందించారు.