SRD :సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీలో ఈద్గా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అవడంతో నీరు రోడ్డుపై పారుతోంది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై నీరు పారడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వేసవి కాలంలో మిషన్ భగీరథ నీరు సకాలంలో సరఫరా చేయాలని కోరుతున్నారు.