BHNG: యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలోని గొల్లగుడిసెల మెయిన్ రోడ్డుపై నిర్మించనున్న కల్వర్టు పనులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులు ఈ కల్వర్టు నిర్మాణంతో తొలగిపోతాయని పేర్కొన్నారు.