జనగామ: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల పూర్తి వివరాలను సేకరించి, యాప్లో సక్రమంగా నమోదు చేయాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని, అవసరమైన భూమి పత్రాలు, కరెంట్ బిల్లు, వంటి వాటిని సరైన విధంగా పరిశీలించి పొందుపరచాలని సూచించారు.