NLG: ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ముందుగా సంస్కృతం పేపర్ వ్యాల్యూయేషన్ చేపట్టగా, ఈ నెల 15న మరో నాలుగు సబ్జెక్టులు, 16, 17 తేదీల్లో మిగిలినవి ప్రారంభమవుతాయి. NLGలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం మూల్యాంకనానికి నియమితులైన అధ్యాపకులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని DIEO సూచించారు.