BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో గురువారం చండీహోమం జరుగుతుందని ఆలయ ఈవో రజిని కుమారి బుధవారం తెలిపారు. చండీహోమంలో పాల్గొనే దంపతులకు అమ్మవారి శేష వస్త్రాలతో పాటు ప్రసాదం అందజేస్తామని తెలిపారు. చండీహోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలతో అదే రోజు నమోదు చేసుకోవాలని సూచించారు.