BHNG: మోత్కూరు మండలంలో రైతులు ధర్నా చేశారు. వివిధ గ్రామాలకు సంబంధించి పాల కేంద్రాలలో గత 5 నెలల నుంచి పాల ఉత్పత్తిదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో శనివారం ఉదయం రైతులు పాల ఉత్పత్తి కేంద్రం ప్రధాన గేటు మూసి ఆందోళన చేపట్టారు. ఐదు నెలల బిల్లులు చెల్లించే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.