NZB: ఏర్గట్ల నుంచి నిర్మల్ వెళ్తున్న ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొని పంట పొలాల్లో బోల్తా పడింది. నిర్మల్‌కు చెందిన పోగుల సత్యనారాయణ (48) తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై పడాల రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.