BDK: జూలూరుపాడు మండలం గంగార తండాలో బుధవారం విద్యుత్ ఘాతానికి వ్యవసాయ ఎద్దు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రైతు ఆంగోత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పనుల కోసం పొలానికి ఎద్దులను తీసుకొని వెళ్ళగా వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఎద్దు తగిలి మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.