SRCL: నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో ఏర్పడిన నాటి నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు. ఇప్పటికే ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.