BDK: పక్షుల ఆశ్రయ కేంద్రం, చెరువులు, వివిధ రకాల తోటల నిర్వహణ విధానాలను సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ పరిశీలించారు. శనివారం కొత్తగూడెం ఏరియా ఎకో పార్క్‌ను సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఎకో పార్క్ ప్రస్తుత స్థితి ప్రణాళికలను అధికారులు సీవీవోకి తెలిపారు.