NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు సంతోషంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ఆకాంక్షించారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.