WNP: గోపాల్పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామ శివారులో ఉన్న గాయత్రి టీటీసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం, జనుంపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ వల్లీ శుక్రవారం విడుదలైన టీజీ సెట్ -2025 ఫలితాలలో ప్రతిభ చాటాడు. ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్ & అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించారు. దీంతో పలువురు ఆయన్ని అభినందించారు.