NRPT: మరికల్ మండల ఎల్లిగండ్ల గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండ్ల గిరిక పోటీలు సర్పంచ్ అశ్విని-నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.5,000 గా ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 20 పైగా జోడెద్దుల బండ్లు పోటీపడనున్నాయి. నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాన్ని ఆస్వాదించారు.