KNR: రాంనగర్ మహాగణపతి నిమజ్జనం నిర్ణయించిన షెడ్యూల్ కాకుండా శనివారం నిమజ్జనం నిర్వహించాలని నిర్వాహకులను జిల్లా కలెక్టర్ కోరారు. శుక్రవారం నాడు పట్టణంలో అధిక సంఖ్యలో విగ్రహ నిమజ్జనంతో పాటు విద్యుత్ తీగలు అధిక సంఖ్యలో తొలగించడం వంటి సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల విద్యుత్ శాఖ అధికారుల సూచన మేరకు శనివారం నిర్వహించాలని కోరారు.