RR: మహేశ్వరంలోని పలు ప్రాంతాల్లో పనులు చేస్తున్నట్లు ఫౌండేషన్ వేసి, తట్టెడు మట్టి వేయలేదని MLA సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. టెండర్లు పిలిచి, అగ్రిమెంట్లు చేసినట్లు చూపిస్తూ మంత్రి శ్రీధర్ బాబు హడావుడిగా వచ్చి గ్రాండ్గా శిలాఫలకాలు ఏర్పాటు చేసినా, పనులు మాత్రం ప్రారంభించలేదని మండిపడ్డారు. పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు.