BDK: టేకులపల్లి(M)తొమ్మిదో మైల్ తండా సమీపంలో ఆదివారం విషాదకర ఘటన జరిగింది. మిరపనారు నాటడానికి వెళ్లిన 15మంది కూలీలు కలుపు మందు కలిపిన బిందెలో ఉన్న మంచి నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుపుమందు కలిపిన బిందెను శుభ్రం చేయకుండానే తాగునీరు పోసి కూలీలకు ఇవ్వడంతో ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.