MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్‌కు చెందిన చింతల శిరీష (26), కూతుర్లు హారిక (8), ఆద్య (5) అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొన్నేళ్లుగా శిరీష, మహేందర్ దంపతులు హైదరాబాదులో నివాసం ఉన్నారు. అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మల్కాపూర్‌కు విచ్చేశారు. నిన్న గొడవ జరగగా, ఇవాళ ఉదయం భర్త వ్యవసాయ పనులకు వెళ్లగా, భార్య ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు.