VKB: కులకచర్ల గిరిజన గురుకులంలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని తెలంగాణ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఉద్యోగులు మెమోరండం ఇచ్చారు. పార్ట్ టైం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వేతనాలు సకాలంలో వచ్చేటట్లు, వేతనాల పెంపునకు కృషి చేయాలని మంత్రిని కోరారు.