GDWL: అయిజ మండలం పులికల్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. అనుమతి లేకుండా నది నుండి తరలించి నిల్వ చేసిన ఇసుకను అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. ఆర్ఐ రజినీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అక్రమ నిల్వలకు బాధ్యులెవరో గుర్తించేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు.