KMR: జిల్లాలో మహిళల రక్షణ కోసం అంకితభావంతో పని చేస్తున్న షీ టీమ్ సభ్యులు సౌజన్య, ప్రవీణలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వారి సేవలను కొనియాడుతూ.. నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో వారి పాత్ర ఎంతో ప్రశంసనీయమైనదని ఎస్పీ కొనియాడారు.