KDP: వీరపునాయునిపల్లె మండల పరిధిలోని పాలగిరి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనిమెల విండ్ పవర్ ప్రాజెక్టు వారి సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.