TPT: వెంకటగిరి కొత్త జడ్జిగా విష్ణువర్మ రానున్నారు. ప్రస్తుతం ఆయన నగరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నగరి బార్ అసోసియేషన్ తరఫున వీడ్కోలు సభ ఏర్పాటు చేసి జడ్జిని సన్మానించారు. అతి చిన్న వయసులోనే ఓపిక, సహనంతో చాలా సంచలనాత్మక, విప్లవాత్మక తీర్పులు వెలువరించారని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు.