SRHతో జరుగుతున్న ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా తొలి సిక్స్ బాదాడు. చెన్నై ఇన్నింగ్స్లో ఇదే మొదటి సిక్స్ కావడం గమనార్హం. అయితే జీషాన్ అన్సారీ బౌలింగ్లో సిక్స్ కొట్టిన జడేజా.. కమిందు బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. 17 బాల్స్లో 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం చెన్నై 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.