ADB: గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని వారు పేర్కొన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు.