పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడంతో.. భారత విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా, లండన్, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో దూరం పెరగుతుంది. ఈ క్రమంలో ప్రయాణ సమయం, టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటించింది.