NTR: కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింగ్ రావు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ వలన యూనియన్ల హక్కులు, సమ్మె చేసే హక్కు, 8 గంటల పని విధానం కోల్పోతామన్నారు.