SKLM: గార మండలంలో గోరువానిపేట, చింతువలసలను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. గార మండలంలోని గోరువానిపేటలో బుధవారం పల్లె నిద్రలో కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు.